`పటాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిపించుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి… ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ప్రధాన పాత్రల్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్… సర్వత్రా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే… నాలుగు వరుస విజయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన అనిల్ రావిపూడి… తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనే విషయంపై రకరకాల కథనాలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం…అనిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండొచ్చట. `ఎఫ్ 2` విడుదలకు ముందే అనిల్… మహేష్‌ని సంప్రదించి ఓ స్టోరీ లైన్ చెప్పాడని… పాయింట్ నచ్చడంతో డెవలప్ చేయమని సూపర్‌స్టార్ చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం `మహర్షి`తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాకే… అనిల్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రావచ్చు. మరో వైపు… సుకుమార్ కాంబినేషన్‌లో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
[youtube_video videoid=EstFgQviuHk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: