రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే వివాదాలకు కారణమైన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏయే అంశాలు చూపిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాత నుండే ఉంటుందని సినిమా ప్రారంభమప్పుడే చెప్పడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఎవైనా వివాదాలు తలెత్తాయంటే అది లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాతే అన్న విషయం అందరికీ తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా..ఇప్పటికే వెన్నుపోటు, ఎందుకు? అనే రెండు పాటలు రిలీజ్ చేసి షాకిచ్చిన వర్మ ఇప్పుడు మరో బాంబు పేల్చడానికి సిద్దమయ్యారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేశారు.
కాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. మిగిలిన పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారో తెలియాలంటే ఆర్జీవీ అప్ డేట్ ఇచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=zNulrFJpDl4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: