నాగార్జున కథానాయకుడిగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా.2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈసినిమాలో బంగార్రాజు పాత్రలో నటించిన నాగార్జున నటనకు మంచి మార్కులు పడ్డాయి. నిజం చెప్పాలంటే ‘బంగార్రాజు’ పాత్రే సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. దాంతో ఆ పాత్ర పేరుతోనే ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు నాగార్జున, కళ్యాణ్ కృష్ణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కళ్యాణ్ కృష్ణ కథను రెడీ చేయగా.. అప్పటి నుండి దానిలో పలు మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నాగార్జునకు ఫైనల్ గా స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జునతోపాటు నాగ చైతన్య కూడా నటించనున్నాడట. అంతేకాదు.. మనవడి పాత్రలో నాగచైతన్య.. తాత పాత్రలో నాగార్జున కనిపించనున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=XnHdCpYDUrE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: