యూనివర్శల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా వృద్ద కమల్ హాసన్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా మళ్లీ ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నామంటేనే చెప్పొచ్చు..భారతీయుడు సినిమా ఎంతలా గుర్తుండిపోయిందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఒక్కోసారి మన సమాజంలో జరిగిన సంఘటనలే సినిమాలుగా తెరకెక్కుతుంటాయి. మన చుట్టుపక్కల జరిగే ఘటనల ఆధారంగానే వాటి నుండి వచ్చిన ఆలోచనలతోనే డైరెక్టర్లు సినిమాలు తెరకెక్కిస్తుంటారు. అలాగే భారతీయుడు సినిమా తీయడానికి కూడా ఓ కారణముందంటున్నాడు శంకర్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ భారతీయుడు సినిమా గురించి మాట్లాడుతూ..తాను కాలేజీ అడ్మిషన్ కోసం ఇన్ కమ్ సర్టిఫికెట్, కమ్యునిటీ సర్టిఫికెట్ అడగగా.. వాటి కోసం అధికారుల దగ్గరకు వెళితే..వారు లంచం అడిగారని.. చాలా బలవంతంగా లంచం ఇవ్వాల్సి వచ్చిందని..ఈ ఆ ఘటనే తనను ‘భారతీయుడు’ సినిమాను తెరకెక్కించేలా చేసిందని శంకర్ వెల్లడించారు. ఇక భారతీయుడు2 లో ప్రస్తుతం సమాజంలో ప్రతి సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించబోతున్నట్లు తెలిపారు.
కాగా ఈరోజు నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో కథానాయికగా కొరియన్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్, శింబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శింబు స్థానంలో ఇప్పుడు సిద్ధార్థ్ పేరు కూడా వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించేంత వరకూ దీనిపై క్లారిటీ రానట్టే. లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=SPLLbmTkuBM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: