
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 21


ట్రైలర్ రిలీజ్ కు వినరో భాగ్యము విష్ణుకథ

దసరా పై మీ ప్రేమకు థ్యంక్స్

మీ ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్

మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ

ఇండియా ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ టైమ్ మల్టీ ప్లెక్స్

రంగమార్తాండ -బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

సెన్సార్ పూర్తిచేసుకున్న మైఖేల్

బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ సీక్వెల్ అప్ డేట్

2023 లో హ్యాట్రిక్ దిశగా మైత్రీ మూవీ మేకర్స్

సీనియర్ కెమెరా మెన్ కు చిరు సాయం

కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

దసరా బరిలో హరి హర వీరమల్లు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ - వేద మూవీ టీమ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో శివరాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ హిట్ వేదం మూవీతో ప్రేక్షకులను అలరించారు. జీ స్టూడియోస్, గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్స్ పై ఎ. హర్ష దర్శకత్వం లో శివరాజ్ కుమార్, ఘనవి లక్ష్మణ్ జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా వేద కన్నడ మూవీ 2022 డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శివరాజ్ కుమార్ 125 వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు.

అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 పవన్ ఎపిసోడ్
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా రూపొందుతున్న అన్ స్టాపబుల్ 2 ప్రోగ్రామ్ ఆహాలో ప్రసారమవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రసారం చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ 2 పార్ట్స్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. మెుట్టమెుదటిసారిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , బాలయ్యతో అన్‌స్టాపబుల్ షో2 లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్, పాలిటిక్స్, పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కు ఆహా టీం నిర్ణయం తీసుకుంది.

ట్రైలర్ రిలీజ్ కు వినరో భాగ్యము విష్ణుకథ
కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

229 .57 కోట్ల గ్రాస్ , 134. 59 కోట్ల షేర్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

చిరు ఎమోషనల్ విశ్వనాథ్ మృతిపై-ఇది అత్యంత విషాదకరమైన రోజు
టాలీవుడ్ లో ఒకతరం సినీ ప్రముఖులు అందరూ దూరమైపోతున్నారు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు లాంటి లెజెండరీ హీరోలు మృతిచెందారు. ఇక రీసెంట్ గానే అలనాటి అందాల నటి జమున మరణించారు. ఇక ఇప్పుడు మరో లెజెండరీ దర్శకుడు మరణం టాలీవుడ్ ను శోక సంద్రంలో ముంచేసింది. కళాతపస్వి విశ్వనాథ్ నేడు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ గత రాత్రి అపోలో ఆస్పత్రిలో కన్నుముశారు. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు అందరూ విశ్వనాథ్ పార్థివ దేహాన్ని సందర్శిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.

లెజెండరీ డైరెక్టర్, కళా తపస్వి కె . విశ్వనాథ్ ఇక లేరు
ఆడియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కె. విశ్వనాథ్, ఇండియన్ సినిమా ల్యాండ్ మార్క్ ఫిల్మ్ పాతాళభైరవి కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మగౌరవం మూవీ తో కె. విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఆ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి మూవీస్ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్స్ అందుకొనడం విశేషం. స్టార్ హీరోలు, విశ్వనాథ్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, స్టార్లను నమ్ముకోకుండా కథలకే ప్రాధాన్యం ఇచ్చారాయన. సీతామహాలక్ష్మీ మూవీ తర్వాత వయసు పైబడిన సోమయాజులుని ప్రధాన పాత్రలో శంకరాభరణం మూవీ తెరకెక్కించి విశ్వనాధ్…

దసరా పై మీ ప్రేమకు థ్యంక్స్
కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటి వరకూ పక్కింటి కుర్రాడి లాంటి పాత్రల్లో అలానే లవర్ బాయ్ పాత్రల్లో ఇక ఓ మాదిరి మాస్ పాత్రల్లో నచించి మెప్పించిన నాని ఈసినిమాతో తన కూడా ఊర మాస్ యాంగిల్ ఉందని నిరూపించడానికి దసరా సనిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మొదటి సారి ఈ రేంజ్ మాస్…

హరి హర వీరమల్లు పాటలపై కీరవాణి అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ఒక్క టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మీ ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై వీలైనంత బజ్ క్రియేట్…

మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ
సూత్రధారణ్ (2001 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన మీరా జాస్మిన్ రన్ మూవీ తో కోలీవుడ్, అమ్మాయి బాగుంది మూవీతో టాలీవుడ్, మౌర్య మూవీతో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో మీరా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మోక్ష (2013 )మూవీ టాలీవుడ్ లో ఆఖరి సినిమా. తరువాత మీరా కొన్ని తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు.

ఇండియా ఎయిర్ పోర్ట్ లో ఫస్ట్ టైమ్ మల్టీ ప్లెక్స్
ఇండియాలో మొదటిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్స్ ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పివిఆర్ సినిమాస్ బుధవారం ప్రకటించింది. ప్రయాణికులకు అందుబాటులో PVR సినిమాస్ తన కొత్త ఏరోహబ్ మల్టీప్లెక్స్‌ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌లో ఐదు స్క్రీన్స్ ఉంటాయి. మొత్తం1,155 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే ప్రయాణీకులకు విమాన సేవలు ఆలస్యం అయినా, వెయిటింగ్ సమయంలో వారికీ ఎంటర్టైన్మెంట్ అందించడమే కాక విమానాశ్రయం చుట్టూ ఉన్న…

రంగమార్తాండ -బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఈసినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ అప్ డేట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క అప్ డేట్ ను ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఈమధ్య వరుసగా సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను…

సెన్సార్ పూర్తిచేసుకున్న మైఖేల్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్ వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న సినిమా మైఖేల్. ఇంకా ఒక్కరోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పిటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. సందీప్ కు ఈసారి హిట్ ఖచ్చితంగా దక్కుతుందన్న నమ్మకంతో…

బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ సీక్వెల్ అప్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ గీతగోవిందం మూవీ 2018 ఆగష్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. విజయ్, రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో హీరో విజయ్, రష్మిక స్టార్…

2023 లో హ్యాట్రిక్ దిశగా మైత్రీ మూవీ మేకర్స్
బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగంలో ప్రవేశించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యంతో కొన్ని సినిమాలు నిర్మించిన ఈసంస్థ పలు మూవీస్ ను నిర్మిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యే అమిగోస్ సక్సెస్ సాధిస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ సాధిస్తుంది.

సీనియర్ కెమెరా మెన్ కు చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇప్పుడు మరో కుటుంబాన్ని ఆదుకున్నారు చిరు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ కుటుంబానికి చిరు సాయం చేశారు.80, 90లలో దేవరాజ్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుండి చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎందరో పెద్ద పెద్ద నటులతో దేవరాజ్ పని చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.అయితే ఇప్పుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న…

శాకుంతలం ఏలేలో ఏలేలో సాంగ్ రిలీజ్
ఎంతో మంది స్టార్ హీరోలతో పనిచేసిన ఇప్పుడు తనమీదే కోట్లు పెట్టి సినిమాలు తీసే స్థాయికి చేరుకుంది సమంత. రీసెంట్ గానే యశోద సినిమాతో తన సత్తా మరోసారి చూపించింది. ఇప్పుడు శాకుంతలం అంటూ మ్యాజిక్ చేయడానికి వచ్చేస్తుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ విజువల్ వండర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే సమంత ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందింస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరో మూడు…

జపాన్ లో 800 మిలియన్ యెన్ (50 కోట్లు )కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న ఆర్ఆర్ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

దసరా బరిలో హరి హర వీరమల్లు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.