కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటి వరకూ పక్కింటి కుర్రాడి లాంటి పాత్రల్లో అలానే లవర్ బాయ్ పాత్రల్లో ఇక ఓ మాదిరి మాస్ పాత్రల్లో నచించి మెప్పించిన నాని ఈసినిమాతో తన కూడా ఊర మాస్ యాంగిల్ ఉందని నిరూపించడానికి దసరా సనిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మొదటి సారి ఈ రేంజ్ మాస్ పాత్రలో వస్తున్నాడు నాని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అంత మాస్ పాత్ర నానికి నప్పుతుందా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటీవల వచ్చిన టీజర్ ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేసేసింది. ఈ టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈ టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూశాం. తాజాగా టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ పట్ల హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు. టీజర్ పై చూపుతున్న ప్రేమకి థాంక్స్ అంటూ.. ఒక ఫోటో ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
Thank you for the overwhelming love for #DasaraTeaser ♥️
Yours
Dharani 🙂 pic.twitter.com/32ScGTHGIQ— Nani (@NameisNani) February 2, 2023
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: