పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ఒక్క టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్స్ కోసం ఎదురూచస్తున్నారు. ఈనేపథ్యంలో ఓ నెటిజన్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్ గురించి కీరవాణిని అడుగగా అందుకు కీరవాణి సమాాధానంగా.. ప్రస్తుతం అయితే నాలుగు పాటలకు సంబంధించిన వర్క్ జరుగుతుంది.. అందులో ఏ పాటను ఫస్ట్ సింగిల్ గా క్రిష్ గారు సెలక్ట్ చేస్తారో చూడాలి అని తెలిపాడు.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: