రంగమార్తాండ -బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

Brahmanandam First Glimpse Released from Rangamarthanda,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie Updates,Rangamarthanda Telugu Movie Latest News,Rangamarthanda Movie Shooting Updates,Rangamarthanda Telugu Movie Shooting Latest News,Brahmanandam First Glimpse Released from Rangamarthanda Movie,Brahmanandam First Glimpse Released from Rangamarthanda Telugu Movie

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఈసినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ అప్ డేట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క అప్ డేట్ ను ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఈమధ్య వరుసగా సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా చిత్ర బృందం బ్రహ్మానందంకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఎమోషనల్ తో నిడిపోయిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్​ బెడ్​పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పిస్తుంది.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌ తో పాటు ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =