సెన్సార్ పూర్తిచేసుకున్న మైఖేల్

Sundeep Kishan Michael Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Michael,Michael Movie,Michael Telugu Movie,Michael Movie Updates,Michael Telugu Movie Latest News,Michael Completes Censor Formalities,Michael Movie Completes Censor Formalities,Michael Telugu Movie Completes Censor Formalities,Sundeep Kishan

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో  భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న సినిమా మైఖేల్. ఇంకా ఒక్కరోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పిటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. సందీప్ కు ఈసారి హిట్ ఖచ్చితంగా దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. 2 గంటల 34 నిమిషాల పాటు రన్ టైం తో మేకర్స్ కట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.