
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 20


మరో మెగా హీరోతో వాల్తేరు వీరయ్య డైరెక్టర్?


ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇంట్రెస్టింగ్ గా దసరా రేస్

AK 62 నుండి తప్పుకున్న విఘ్నేష్

ఉత్తరాంధ్రుల మెగా ప్రేమ

జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ పై క్లారిటీ

అమిగోస్ ట్రైలర్ రిలీజ్

దళపతి 67 టైటిల్ ప్రోమో రిలీజ్

కింగ్ నాగార్జున న్యూ మూవీ అప్ డేట్

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్

సెన్సార్ పూర్తిచేసుకున్న అమిగోస్
రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇక ఈసినిమా ఫిబ్రవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం. ఈ…

ఫ్యామిలీస్ తప్పక చూడాల్సిన సినిమా రైటర్ పద్మభూషణ్
ఈమధ్య చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు చిన్నసినిమాలకు పెద్ద హీరోల సపోర్ట్ కూడా బాగానే అందుతుంది. సోషల్ మీడియా వేదికగా తమ సపోర్ట్ ను అందిస్తున్నారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారు. రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. కంటెంట్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని తాజాగా మరోమారు నిరూపించింది రైటర్ పద్మభూషణ్.

మరో మెగా హీరోతో వాల్తేరు వీరయ్య డైరెక్టర్?
పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన డైరెక్టర్ బాబీ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈమధ్య మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని సైతం దక్కించుకొని చిరుకి వాల్తేరు వీరయ్య సినిమాతో బిగెస్ట్ హిట్ అందించాడు. స్వతహాగా మెగాస్టార్ అభిమాని అవ్వడంతో అభిమాన హీరో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభిమాని హీరోకి ఒక సూపర్ హిట్ మూవీని అందించాడు. మెగాస్టార్ ను మెగా అభిమానులు మళ్లీ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో అదరగొట్టారు చిరు. చిరంజీవితో పాటు రవితేజ కూడా ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ…

యాక్షన్ సీక్వెన్స్ తో #NTR 30 మూవీ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మిస్ యూ అంటూ స్నేహారెడ్డి ఎమోషనల్ పోస్ట్
మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు, బ్లాక్ బస్టర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అల్లు అర్జున్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మెగా స్టార్ చిరంజీవి తర్వాత బెస్ట్ డ్యాన్సర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మెగా స్టార్ చిరంజీవి తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ట్రెడిషినల్ , క్లాసికల్ , ఫాస్ట్ బీట్ , మెలోడీ , ర్యాప్ , ఫోక్ , డిస్కో వంటి డ్యాన్స్ లలో ఏ డ్యాన్స్ కైనా న్యాయం చేయగల సత్తా ఉన్న నటుడు చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ తో బ్రేక్ డ్యాన్స్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఎలాగైనా సంక్రాంతి రేసులో దించాలనుకున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు కాబట్టి అది కూడా కుదరలేదు. ఈ గ్యాప్ లో రిలీజ్ డేట్ పై పలు వార్తలు…

జపాన్ లో 105వ రోజు ఆర్ ఆర్ ఆర్ మూవీసెన్సేషన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
ఇంట్రెస్టింగ్ గా దసరా రేస్
ప్రతి ఇండస్ట్రీలో పండుగలకి సినిమాలను రిలీజ్ చేయడం అన్నది కామన్. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతి రేసు ముగిసింది. పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి సందడి చేశాయి. ముఖ్యంగా బాలకృష్ణ వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సీఫీస్ ను బద్దలు కొట్టాయి. ఇక వచ్చేది శివరాత్రి. ఈ పండుగకు కూడా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ప్రతి ఏడాది దసరా హడావుడి కూడా బాగానే ఉంటుంది. చాలా సినిమాలు దసరాకు రావడానికి సిద్దమవుతుంటాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది దసరా రేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది.

శంకరాభరణం మూవీ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కె విశ్వనాధ్ దర్శకత్వంలో జె వి సోమయాజులు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా శంకరాభరణం మూవీ 1980 ఫిబ్రవరి 2 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 4 నేషనల్ , 7 నంది అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ పలు ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలో డబ్బింగ్ జరుపుకుంది. శంకరాభరణం మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ వన్ ఇయర్ కు పైగా థియేటర్స్ లో రన్ కావడం విశేషం. కె వి మహదేవన్ స్వరకల్పనలో సాంగ్స్ అన్ని భాషల , అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం విశేషం.

AK 62 నుండి తప్పుకున్న విఘ్నేష్
తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వలిమై, ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు అజిత్. ఇక రీసెంట్ గానే తన కొత్త సినిమాకు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తన కెరీర్ లో రాబోతున్న 62వ సినిమా ఇది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందనున్నట్టు ఇప్పటికే తెలిపారు.

ఉత్తరాంధ్రుల మెగా ప్రేమ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ 21 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 230 కోట్ల గ్రాస్ , 135 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది.

14 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన అన్ స్టాపబుల్ 2 పవన్ ఎపిసోడ్ 1
మెుట్టమెుదటిసారిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , బాలయ్యతో అన్‌స్టాపబుల్ షో2 లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొంచెం ఫన్, పాలిటిక్స్, పర్సనల్ విశేషాలతో ఈ ఎపిసోడ్ రూపొందింది ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కు ఆహా టీం నిర్ణయం తీసుకుంది.ఆహా టీమ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నా విషయం తెలిసిందే.

జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ పై క్లారిటీ
ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాలో దాదాపు జాన్వీ కపూర్ నటించే అవకాశాలే ఉందంటున్నారు.

అమిగోస్ ట్రైలర్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

దళపతి 67 టైటిల్ ప్రోమో రిలీజ్
దళపతి విజయ్ రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా షూటింగ్ ఈనెలలోనే ప్రారంభమైంది. ఇక ఈ ప్రాజెక్ట్ ను రీసెంట్ గానే అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పటినుండి ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంజయ్ దత్…

కింగ్ నాగార్జున న్యూ మూవీ అప్ డేట్
విక్రమ్ (1986 ) మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన నాగార్జుననటుడు, నిర్మాత, టీవీ ప్రెజెంటర్ గా రాణిస్తున్నారు. అన్నమయ్య మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2002 సంవత్సరంలో బంగార్రాజు, ది ఘోస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా ఒక పీరియాడికల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్
తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీన బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ కథానాయికగా తెరకెక్కిన కరున్ గాపియం, ఘోష్టి తమిళ మూవీస్, ఉమ హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK108 మూవీ లో కాజల్ కథానాయికగా ఎంపిక అయినట్టు…

బుట్టబొమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్దు జొన్నలగడ్డ స్పీచ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో అనిఖ సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధానపాత్రలలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ బుట్టబొమ్మ మూవీ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. గోపీ సుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.