లెజెండరీ డైరెక్టర్, కళా తపస్వి కె . విశ్వనాథ్ ఇక లేరు

Kalatapasvi K Viswanath Garu is No More,Legendary Telugu Director K Viswanath Has Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Director K Viswanath,Director K Viswanath Latest News,Director K Viswanath Movies,Director K Viswanath Movies List,Director K Viswanath No More,Director K Viswanath Passes Away,Director K Viswanath Has Passed Away,K Viswanath No More,K Viswanath RIP

ఆడియో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కె. విశ్వనాథ్, ఇండియన్ సినిమా ల్యాండ్ మార్క్ ఫిల్మ్ పాతాళభైరవి కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మగౌరవం మూవీ తో కె. విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఆ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి మూవీస్ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్స్ అందుకొనడం విశేషం. స్టార్ హీరోలు, విశ్వనాథ్‌తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, స్టార్లను నమ్ముకోకుండా కథలకే ప్రాధాన్యం ఇచ్చారాయన. సీతామహాలక్ష్మీ మూవీ తర్వాత వయసు పైబడిన సోమయాజులుని ప్రధాన పాత్రలో శంకరాభరణం మూవీ తెరకెక్కించి విశ్వనాధ్ కర్నాటిక్ సంగీతానికి పెద్ద పీట వేశారు. తెలుగు భాష తెలియని వారు కూడా ఆ మూవీ సాంగ్స్ ను ఎంజాయ్ చేశారు. ఆ మూవీ ఘనవిజయం సాధించి పలు అవార్డ్స్ అందుకుంది. సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వయంకృషి, స్వర్ణ కమలం, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం వంటి మూవీస్ తో విశ్వనాథ్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

60 సంవత్సరాలలో వివిధ జానర్ లో 53 సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు విశ్వనాధ్ 5 నేషనల్, 7 నంది, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తెలుగు , తమిళ , కన్నడ భాష పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వనాథ్ నటుడిగా ప్రేక్షకులను అలరించారు. నటుడు, దర్శకుడిగా కళామాతల్లి కి సేవలందించిన విశ్వనాధ్ పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు అందుకున్నారు. 92 సంవత్సరాల వయస్సులో దర్శకుడు విశ్వనాధ్ 2023 ఫిబ్రవరి 2 వ తేదీ శివైక్యం అయ్యారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fifteen =