కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 22

Telugu Young Director Venky Atluri Ties The Knot,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Venky Atluri,Venky Atluri Latest News,Venky Atluri Marriage Updates,Telugu Young Director V
సినిమా వార్తలు

ఘనంగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివాహం

టాలీవుడ్ లో గత కొంత కాలంగా సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు యంగ్ డైరెక్టర్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ అట్లూరీ. ఆయన వివాహం నేడు జరిగింది. పూజా అనే యువతితో ఆయన ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 1 వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా వీరి విహహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులతో కలిసి దిగిన ఓ ఫొటోని నితిన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఇక ఫొటోలో ఆ నితిన్ మరియు అతని భార్య షాలిని, నటి కీర్తి సురేష్ మరియు దర్శకుడు వెంకీ కుడుముల ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Waltair Veerayya Movie Made 17.38 Crore Profit in Nizam,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranjeevi,Shruti Haasan,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya T
సినిమా వార్తలు

నైజాం లో 17. 38 కోట్ల ప్రాఫిట్ తో వాల్తేరు వీరయ్య మూవీ రికార్డ్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
#SSMB28 is My Dream Project Says S Thaman,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,SSMB28,SSMB28 Movie,SSMB28 Telugu Movie,SSMB28 Movie Updates,SSMB28 Telugu Movie Latest News,Thama
సినిమా వార్తలు

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ #SSMB 28

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ చేతిలో కబ్జా సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అప్పుడప్పుడు నిర్మాతగా కూడా మారుతుంటారన్న సంగతి తెలిసిందే కదా. నితిన్ గత ఏడాది తమ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్…

TFN Adminవాట్సాప్
Brahmanandam First Look Poster Released From Keedaa Cola Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Keedaa Cola,Keedaa Cola Movie,Keedaa Cola Telugu Movie,Keedaa Cola Movie Upda
ఫస్ట్ లుక్

కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
enno ratrulosthayi song out from amigos movie
సాంగ్

అమిగోస్- ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రిలీజ్

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Nandamuri Taraka Ratna Health Condition Latest News,Taraka Ratna Latest Health Bulletin,Taraka Ratna Health Condition,Taraka Ratna Health,Taraka Ratna Health Latest News,Taraka Ratna's Health Bulletin,Taraka Ratna Health Bulletin Latest,Taraka Ratna
సినిమా వార్తలు

క్రిటికల్ కండిషన్ లో

నందమూరి తారక రత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Team TFNవాట్సాప్
shiva nirvana give update on khushi movie regular shoot
షూటింగ్ అప్‌డేట్

ఖుషి-త్వరలో షూటింగ్ రీస్టార్ట్

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో మధ్యలో పలు రూమర్స్ కూడా తెరపైకి వచ్చాయి. ఈసినిమాలో సమంత…

TFN Adminవాట్సాప్
Nani Dasara Movie Teaser Out Now,Dasara Movie Teaser Out Now: Nani’s DasaRAW Is Filled With Rawness,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Dasara,Dasara Movie Teaser,Dasara Telugu
ట్రైలర్ & టీజర్

నాని దసరా టీజర్ రిలీజ్

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి పాటలు, పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
Ravi Teja Different Looks in Tiger Nageswara Rao,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja New Movie News,Ravi Teja Upcoming Movie Details,R
సినిమా వార్తలు

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాల పెండింగ్ షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చాయి. తాాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లలో కనిపించనున్నాడట. స్టైలిష్, రగ్డ్, యంగ్…

TFN Adminవాట్సాప్
Ashika Ranganath about Amigos Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Telugu Movie Latest News,Kalyan Ram,
సినిమా వార్తలు

అమిగోస్ మూవీ గురించి హీరోయిన్ ఆషికా రంగనాథ్ ముచ్చట్లు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగ‌నాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 17, 2023 న రిలీజ్‌ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందింస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ విడుదల చేసింది. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Chandramukhi 2 Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Movie Updates,Chandramukh
సినిమా వార్తలు

చంద్ర ముఖి 2 మూవీ స్పెషల్ అప్ డేట్

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani to Grace Sundeep Kishan Michael Movie Pre Release Event,Sundeep Kishan’s Michael Pre-Release Event Details,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Sundeep Kishan,
సినిమా వార్తలు

మైఖేల్ కోసం న్యాచురల్ స్టార్

రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా మైఖేల్. ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈసినిమాతో సందీప్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. దీనికోసం డేట్ ను వేదికను…

TFN Adminవాట్సాప్
NTR Emotional Words About Taraka Ratna,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR Emotional About Taraka Ratna,Taraka Ratna Health Condition Latest Update,Kalyan Ram,Taraka Rat
సినిమా వార్తలు

మా తారకరత్న అన్నకి మేమున్నాం - ఎన్టీఆర్

యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడకు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా, అభిమానులతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు వెల్లడించారు. తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని.. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ చెప్పారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan to Join Sankranthi 2024 Race,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Latest Film D
సినిమా వార్తలు

2024 సంక్రాంతి రేసులో పవన్?

ఈ ఏడాది సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతికి బరిలో దిగిన రెండు తెలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఇక అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ వచ్చేస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయినట్టు కనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా…

TFN Adminవాట్సాప్
Nani 30 Movie Grand Launch on 31st January,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Nani 30,Nani 30 Movie,Nani 30 Telugu Movie,Nani 30 Movie Updates,Nani 30 Movie Latest News,Acto
సినిమా వార్తలు

గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30

విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Superstar Rajinikanth praises Veera Simha Reddy Movie and Team,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Superstar Rajinikanth,Superstar Rajinikanth Latest News,Superstar Rajinikant
సినిమా వార్తలు

వీర సింహారెడ్డి మూవీ పై తలైవా రజనీకాంత్ ప్రశంసలు

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

Team TFNవాట్సాప్
Surya Emotional Post On Dubbing Artist Srinivasa Murthy Demise,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Srinivasa Murthy,Srinivasa Murthy Latest News,Srinivasa Murthy No More,Dubbi
సినిమా వార్తలు

శ్రీనివాస మూర్తి మృతిపై సూర్య ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ రావ‌టంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. అయితే ప‌రిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇక శ్రీనివాస మూర్తి మృతిపై తమిళ్ స్టార్ హీరో సూర్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నివాళులు అర్పించారు. ఇది వ్యక్తిగతంగా నాకు పెద్ద నష్టం. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి గారి గాత్రం, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. మీరు మా అందరి నుండి ఇంత త్వరగా దూరమవ్వడం బాధాకరం, మీరు పవిత్రాత్మకు శాంతి కలగాలి అంటూ సూర్య పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి సూర్యకు తెలుగులో డబ్బింగ్…

TFN Adminవాట్సాప్
Nani 30th Movie Opening Ceremony Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Nani,Nani Latest News,Hero Nani,Actor Nani,Nani Upcoming Movie News,Nani Latest Film Details,Na
సినిమా వార్తలు

నాని 30 ఓపెనింగ్ డేట్ ఫిక్స్

న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు నాని తన 30 వ సినిమాను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ఓపెనింగ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా ప్రారంభ పూజా…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And Sujeeth Movie Crazy Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Next Film U
సినిమా వార్తలు

పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీఎంట్రీ తరువాత ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తను చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా తో పాటు పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్