చిరు ఎమోషనల్ విశ్వనాథ్‌ మృతిపై-ఇది అత్యంత విషాదకరమైన రోజు

Megastar Chiranjeevi Emotional Post On K Viswanath Demise,Kalatapasvi K Viswanath Garu is No More,Legendary Telugu Director K Viswanath Has Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Director K Viswanath,Director K Viswanath Latest News,Director K Viswanath Movies,Director K Viswanath Movies List,Director K Viswanath No More,Director K Viswanath Passes Away,Director K Viswanath Has Passed Away,K Viswanath No More,K Viswanath RIP

టాలీవుడ్ లో ఒకతరం సినీ ప్రముఖులు అందరూ దూరమైపోతున్నారు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు లాంటి లెజెండరీ హీరోలు మృతిచెందారు. ఇక రీసెంట్ గానే అలనాటి అందాల నటి జమున మరణించారు. ఇక ఇప్పుడు మరో లెజెండరీ దర్శకుడు మరణం టాలీవుడ్ ను శోక సంద్రంలో ముంచేసింది. కళాతపస్వి విశ్వనాథ్ నేడు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ గత రాత్రి అపోలో ఆస్పత్రిలో కన్నుముశారు. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు అందరూ విశ్వనాథ్‌ పార్థివ దేహాన్ని సందర్శిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విశ్వనాథ్ గారి మరణంతో చిరంజీవి స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది.

ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను అని పోస్ట్ లో తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 1 =