పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ – వేద మూవీ టీమ్

Shiva Rajkumar Vedha Movie Team Thank Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shiva Rajkumar,Vedha,Vedha Movie,Vedha Telugu Movie,Vedha Movie Updates,Vedha Telugu Movie Latest News,Vedha Movie Latest News,Shiva Rajkumar,Shiva Rajkumar Latest News,Vedha Movie Team Thank Prabhas,Vedha Telugu Movie Team Thank Prabhas,Vedha Team Thank Prabhas

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో శివరాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ హిట్ వేదం మూవీతో ప్రేక్షకులను అలరించారు. జీ స్టూడియోస్‌, గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్స్ పై ఎ. హర్ష దర్శకత్వం లో శివరాజ్ కుమార్, ఘనవి లక్ష్మణ్ జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా వేద కన్నడ మూవీ 2022 డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శివరాజ్ కుమార్ 125 వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. అర్జున్ జన్య సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ హోమ్ బ్యానర్‌లో వేద చిత్రం మొదటి వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ కు సిద్దం అవుతుండటం విశేషం. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోసర్ట్స్ రిలీజ్ చేసినప్పుడే ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలోని కంటెంట్‌పై నమ్మకంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఈ చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =