టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై వీలైనంత బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా సందీప్ కిషన్ తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతిని కలిసాడు. ఈనేపథ్యంలో సందీప్ కిషన్ విజయ్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. డియర్ దళపతి మీ ప్రేమకు అలానే సపోర్ట్ కు థ్యాంక్స్.. ఎంతో వినయపూర్వకంగా, స్పూర్తిదాయకంగా ఉన్నందుకు ధన్యవాదాలు.. లవ్ యూ అన్నా అని ట్వీట్ చేశాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ఈఫొటో నెట్టింట వైరల్ గా మారుతుంది.
Thank You Dearest Thalapathy for your kind words , love and support for #Michael 🤍
Thank you for being so Humble & Inspiring 🤍
Love you anna 🤍@Dir_Lokesh presents a @jeranjit film …#Michael in theatres Tomorrow 🤍#Thalapathy67 pic.twitter.com/RaHRFsWrZR— Sundeep MICHAEL-Feb 3rd Kishan (@sundeepkishan) February 2, 2023
కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: