ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్

Agent Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Telugu Movie Latest News,Agent Movie Shooting Updates,Agent Telugu Movie Shooting Latest News,Akhil,Akkineni Akhil,Agent Release Date,Agent Movie Release Date,Agent Telugu Movie Release Date,Agent Release Date Locked,Agent Movie Release Date Confirmed

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఎలాగైనా సంక్రాంతి రేసులో దించాలనుకున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోలేదు కాబట్టి అది కూడా కుదరలేదు. ఈ గ్యాప్ లో రిలీజ్ డేట్ పై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఫైనల్ గా నేడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మొహం నిండా రక్తంతో ఉన్న అఖిల్ పోస్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఒక్క పోస్టర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + eighteen =