ఫ్యామిలీస్ తప్పక చూడాల్సిన సినిమా రైటర్ పద్మభూషణ్

Superstar Mahesh Babu Praises on Writer Padmabhushan,Mahesh Babu Loved Suhas’s Writer Padmabhushan Movie And Calls It A Must-Watch,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Writer Padmabhushan,Writer Padmabhushan Movie,Writer Padmabhushan Telugu Movie,Writer Padmabhushan Movie Updates,Writer Padmabhushan Telugu Movie Latest News,Superstar Mahesh Babu About Writer Padmabhushan,Mahesh Babu Comments On Writer Padmabhushan,Mahesh Babu Praises On Writer Padmabhushan Telugu Movie

ఈమధ్య చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతేకాదు చిన్నసినిమాలకు పెద్ద హీరోల సపోర్ట్ కూడా బాగానే అందుతుంది. సోషల్ మీడియా వేదికగా తమ సపోర్ట్ ను అందిస్తున్నారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాకు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారు. రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. కంటెంట్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని తాజాగా మరోమారు నిరూపించింది రైటర్ పద్మభూషణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు చూడటం జరిగింది. ఈనేపథ్యంలో దీనిపై స్పందించిన మహేష్ బాబు ఈసినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానని.. హృదయాన్ని హత్తుకునే సినిమా ఇది.. ముఖ్యంగా క్లైమాక్స్.. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని.. మంచి సక్సెస్ ను అందుకున్న చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ అంటూ తెలిపారు.

కాగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో టీనా, శ్రీ గౌరీ ప్రియ, రోహిణి, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రూ మనోహరన్ నిర్మించిన ఈసినిమాకు శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం అందించగా.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫి అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − two =