అమిగోస్ ట్రైలర్ రిలీజ్

kalyan rams amigos trailer out

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఇట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటుంది. ‘మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం’ .. ‘మనం ఫ్రెండ్స్ కాదు .. బ్రదర్స్ అంతకన్నా కాదు’ .. ‘రాక్షసుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదరా’ అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తనని పోలిన మనుషుల వలన హీరో చిక్కుల్లో పడతాడనే విషయం ఈ ట్రైలర్ వలన అర్థమవుతోంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 11 =