పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన డైరెక్టర్ బాబీ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈమధ్య మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని సైతం దక్కించుకొని చిరుకి వాల్తేరు వీరయ్య సినిమాతో బిగెస్ట్ హిట్ అందించాడు. స్వతహాగా మెగాస్టార్ అభిమాని అవ్వడంతో అభిమాన హీరో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభిమాని హీరోకి ఒక సూపర్ హిట్ మూవీని అందించాడు. మెగాస్టార్ ను మెగా అభిమానులు మళ్లీ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో అదరగొట్టారు చిరు. చిరంజీవితో పాటు రవితేజ కూడా ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు బాబీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తన దర్శకత్వంలో నటించేందుకు చిరంజీవి అంగీకరించడమే తనకు పెద్ద బహుమతితో సమానమని చెప్పారు. సినిమా విడుదలై నాలుగు వారాలు అవుతున్నా కలెక్షన్లు బాగా వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తమ టీమ్ విజయోత్సవాల్లో ఉందని తెలిపారు. మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నానని ఈ సందర్భంగా చెప్పారు. మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: