మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు, బ్లాక్ బస్టర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అల్లు అర్జున్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే నల్గొండ జిల్లాకు చెందిన స్నేహారెడ్డి ని పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వారికి తనయుడు అయాన్ , తనయ అర్హ ఉన్నారు. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారన్న విషయం తెలిసిందే. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో సొంతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ , తమ పిల్లలకుసంబంధించిన ఫోటోలను, వీడియోలను నిత్యం షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా స్నేహ రెడ్డి ఇన్ స్టా స్టోరీలో తన భర్త అల్లు అర్జున్ ని హగ్ చేసుకున్న తన ఫోటోను షేర్ చేస్తూ మిస్ యూ అంటూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.