
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 19


50 రోజులు పూర్తి చేసుకున్న వారిసు (వారసుడు )

వీరసింహారెడ్డి @ 50డేస్

#VT13 హీరోయిన్ అప్ డేట్

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

చిత్రీకరణ లో శర్వానంద్, కృతి శెట్టి ల మూవీ

అఖిల్ ఊచకోత- మ్యాచ్ తారకరత్నకు అంకితం

సిద్ధు జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ కన్ ఫర్మ్

జపాన్ లో తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ ఆర్ ఆర్

ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ డేట్

ఒకటో నెంబర్ కుర్రాడు తారక రత్న ఇక లేరు

ధమ్కీ కొత్త రిలీజ్ ప్లాన్

NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా

త్వరలో ఏజెంట్ మ్యూజికల్ బ్లాస్ట్

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ధమ్కీ షూటింగ్ అప్ డేట్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు జోడీగా శ్రీలీల ?
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన ధమాకా మూవీతో మరొక భారీ సక్సెస్ సొంతం చేసుకుని బాగా ఫామ్ లో ఉన్న శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. శ్రీలీల యంగ్ హీరోస్ మూవీస్ తో పాటు సీనియర్ హీరోస్ మూవీస్ లో కూడా నటిస్తున్నారు.

50 రోజులు పూర్తి చేసుకున్న వారిసు (వారసుడు )
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వారిసు మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి.

వీరసింహారెడ్డి @ 50డేస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

#VT13 హీరోయిన్ అప్ డేట్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

ఓటీటీ లోకి వచ్చేసిన మైఖేల్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. తన మేకోవర్ పూర్తిగా మార్చేసి డార్క్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాతో సందీప్ కిషన్ బాగానే ఆకట్టుకున్నాడు.

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
సినీ పరిశ్రమల్లో అతి తక్కువ వయసులో హీరోలు చనిపోవడం ఎంతో కలిచివేస్తుంది. ఆ మధ్య కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయారు. ఇంకా ఎంతో మంది నటీ నటులు చనిపోయారు. ఇక ఇప్పుడు అతి తక్కువ వయసులోనే నందమూరి తారకరత్న చనిపోవడం అనేది సినీ పరిశ్రమను కలచివేస్తుంది. లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. అదే రోజు గుండెపోటుకు గురయ్యారు. ఈనేపథ్యంలో మొదట కుప్పంలో చికిత్స అందించగా.. అనంతరం బెంగుళూరు లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. దాదాపు మూడు వారాలకు పైగా డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చారు. అయినా కూడా పరిస్థితి విషమించడంతో మొన్న…

చిత్రీకరణ లో శర్వానంద్, కృతి శెట్టి ల మూవీ
రీసెంట్ గా ఒకే ఒక జీవితం మూవీతో హీరో శర్వానంద్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో కథానాయికగా కృతి శెట్టి ఎంపిక అయ్యారు. కృతి శెట్టి గ్లామర్ పార్ట్ కే పరిమితం కాకుండా.. ఈసినిమాలో మంచి పెర్ఫామెన్స్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.

అఖిల్ ఊచకోత- మ్యాచ్ తారకరత్నకు అంకితం
అక్కినేని వారసత్వంలో మూడో జనరేషన్ హీరో అఖిల్. ఇక అఖిల్ సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు నుండే క్రికెట్ బాగా ఆడతాడన్న సంగతి తెలిసిందే కదా. అఖిల్ కి క్రికెట్ లో మంచి నైపుణ్యం ఉంది. ప్రస్తుతం సిసిఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. రాయ్ పూర్ లో నిన్న తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అఖిల్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు సాధించి తన జట్టుని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో అఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ ను తారకరత్నకు అంకితం ఇస్తున్నట్టు అఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. దీంతో అఖిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ.

సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ సాధించిన ఈమూవీ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈమూవీ ఫిబ్రవరి 23వ తేదీ నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

సిద్ధు జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ కన్ ఫర్మ్
తమిళ, తెలుగు, మలయాళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా అనుపమ కొనసాగుతున్నారు. అనుపమ కథానాయికగా తెరకెక్కిన కార్తికేయ 2, 18 పేజెస్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. అనుపమకు కార్తికేయ 2 మూవీ ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చి, అనుపమ కెరీర్ కు ప్లస్ అయ్యింది. అనుపమ ప్రస్తుతం సైరెన్ (తమిళ ), టిల్లు స్క్వేర్ (తెలుగు ), ఒక మలయాళ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు.

జపాన్ లో తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్…

రిలీజ్ అయిన రావణాసుర సెకండ్ సింగల్ ప్యార్ లోన పాగల్
ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా…

ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ డేట్
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయిలో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

ఒకటో నెంబర్ కుర్రాడు తారక రత్న ఇక లేరు
2001 సంవత్సరంలో తారక రత్న నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభమయ్యాయి. ఒకే రోజు అత్యధిక సినిమాలు ఓపెనింగ్ చేసుకొన్న హీరోగా తారకరత్న గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతోతారక రత్న హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో తారకరత్న 30కిపైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తారక రత్న ప్రేక్షకులను అలరించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అమరావతి…

ధమ్కీ కొత్త రిలీజ్ ప్లాన్
కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే ట్రైలర్ 2.0 రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తుండగా.. ఈసినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడింది. నందమూరి తారక రత్న మరణం వల్ల ఎన్టీఆర్ 30 వ సినిమా ఓపెనింగ్ డేట్ ను వాయిదా వేశారు. కొత్త డేట్ ను త్వరలో తెలియచేయనున్నారు. కాగా…

త్వరలో ఏజెంట్ మ్యూజికల్ బ్లాస్ట్
రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే రొమాంటిక్ కామెడీతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నాడు అఖిల్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ రూపొందుతుంది. ఇక ఈసినిమా కోసం అఖిల్ కూడా తన మేకర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటినుండే మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ కూడా క్యూరీయాసిటీని పెంచింది.

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మైత్రీ మూవీస్ చేతిలో కోనసీమ థగ్స్- భారీ స్థాయిలో రిలీజ్
శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ధమ్కీ షూటింగ్ అప్ డేట్
కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ట్రైలర్ 1.0 అంటూ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం చిత్రయూనిట్ చివరి సాంగ్ షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పబ్ నేపథ్యంలో సాగే ఈపాట…