AK 62 నుండి తప్పుకున్న విఘ్నేష్

Vignesh Shivan Out of Ajith 62 Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Ajith 62 Movie,Vignesh Shivan,Vignesh Shivan Latest News,Vignesh Shivan News,Vignesh Shivan New Movie News,Vignesh Shivan Upcoming Movie News,Vignesh Shivan Latest Film Details,Ajith 62 Movie,Ajith 62 Movie News,Ajith 62 Movie Latest News

తమిళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వలిమై, ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు అజిత్. ఇక రీసెంట్ గానే తన కొత్త సినిమాకు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తన కెరీర్ లో రాబోతున్న 62వ సినిమా ఇది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందనున్నట్టు ఇప్పటికే తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుండి విఘ్నేష్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. కొద్దిరోజులుగా విఘ్నేష్ శివన్ ప్లేస్ మరో దర్శకుడిని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ లో ప్రొఫైల్ ను అలానే డిస్క్రిప్షన్ లో ఏకే 62 అని తీసేసి విక్కీ6 అని మార్చాడు. దీంతో ఏకే 62 నుండి విఘ్నేష్ అధికారికంగా తప్పుకున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాకు మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. ఇంకా ఈసినిమాలో ఐశ్వర్యరాయ్, అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటించబోతున్నరాు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్‌కరణ్ నిర్మిస్తుండగా. నిర్మాణ బాధ్యతలను జీకేఎం తమిళ కుమరన్ నిర్వహించనున్నారు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాను ఈ యేడాది మధ్యలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 10 =