జపాన్ లో 105వ రోజు ఆర్ ఆర్ ఆర్ మూవీసెన్సేషన్

RRR Day 105 is Bigger Than the Opening Day Collections in Japan,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR,SS Rajamouli,Ram Charan,RRR Collections,RRR Movie Collections,RRR Telugu Movie Collections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆర్ఆర్ఆర్ మూవీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఆర్ఆర్ఆర్ మూవీ 800 మిలియన్ యెన్స్ (సుమారు 50 కోట్లు )కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇటీవలే జపాన్ లో 100 రోజుల సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ని 100 కి పైగా కేంద్రాల్లో జరుపుకోవడం మరో అరుదైన ఘనతగా మారగా, ఈ చిత్రం అక్కడ అంతకంతకు వండర్స్ నమోదు చేస్తుంది. ఈ మూవీ ఇప్పుడు 105వ రోజు కి అక్కడ చేరుకోగా ఈ 105 వ రోజున ఈ సినిమా రిలీజ్ అయ్యిన రోజు కన్నా ఎక్కువ వసూళ్లు నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా 5 లక్షల 13 వేల 787 ఫుట్ ఫాల్స్ కూడా నమోదు అయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =