ఉత్తరాంధ్రుల మెగా ప్రేమ

Chiranjeevi Waltair Veerayya Movie Collected 25 Crore in Uttarandhra,Chiranjeevi, Latest Telugu Movie News, Latest Tollywood News, Shruti Haasan, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Waltair Veerayya, Waltair Veerayya Box Office Collections, Waltair Veerayya Collections, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie Areawise Collections, Waltair Veerayya Movie Collections, waltair veerayya movie made 17.38 crore profit in nizam, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu movie, Waltair Veerayya Telugu Movie Collections, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Worldwide Collections, waltair veerayya worldwide box office collection

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ 21 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 230 కోట్ల గ్రాస్ , 135 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్ హీరోల సినిమాలకు కూడా మిగతా ఏరియాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో అద్భుత స్పందన లభిస్తుంది . చిరుకు ముందు నుంచి అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు అక్కడ గతంలో అనేక రికార్డులు నెలకొల్పాయి.ఈ సినిమా కథ కూడా వైజాగ్‌లో జరిగేది కావడం.. చిరు ఇందులో ఉత్తరాంధ్ర యాస మాట్లాడ్డంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యి ,ఈ మూవీ ని విజయవంతం చేశారు. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఉత్తరాంధ్రలో మంచి ఊపు చూపించిన వాల్తేరు వీరయ్య. విడుదల రోజు నుంచి హౌస్‌ ఫుల్ షోలతో నడిచింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మాత్రం ఈమూవీ కి టికెట్ దొరకడం కష్టమైంది. ఈ మూవీ కి అక్కడ స్క్రీన్లు, షోలు పెంచిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర లో వాల్తేరు వీరయ్య మూవీ కి 10.2 కోట్లకు బిజినెస్ జరుగగా ఇప్పటివరకూ రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 20 =