దళపతి 67 టైటిల్ ప్రోమో రిలీజ్

Thalapathy 67 Title Reveal Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Leo,Leo Movie,Leo Telugu Movie,Leo Movie Updates,Leo Telugu Movie Latest News,Leo Movie Shooting Updates,Leo Telugu Movie Shooting Latest News,Thalapathy 67,Thalapathy 67 Movie Title Released

దళపతి విజయ్ రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమా షూటింగ్ ఈనెలలోనే ప్రారంభమైంది. ఇక ఈ ప్రాజెక్ట్ ను రీసెంట్ గానే అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పటినుండి ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్ కు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ప్రస్తుతం దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తోనే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు లియో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తుండగా.. సతీశ్ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా.. అన్బరివ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eleven =