
ట్యాగ్ · 290 కథనాలు · పేజీ 6


నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా..!

"వాల్తేరు వీరయ్య " గా చిరంజీవి మాస్ లుక్

పూజాహెగ్డే న్యూ లుక్

'రంగమార్తాండ' కోసం చిరు గాత్ర దానం..!

'ఆది పురుష్' ఫైనల్ షెడ్యూల్ లో ప్రభాస్..!

యాక్షన్ సీక్వెన్స్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'

శ్రీసింహా 'భాగ్ సాలే' షూటింగ్ మొదలు

రష్మిక హెవీ వర్కౌట్

"రాధేశ్యామ్" మూవీ టీజర్ రికార్డ్

'సలార్' ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్..!

టాలీవుడ్ లో బిజీగా శ్రీలీల

'సూపర్ హీరో' కు 'ప్రాజెక్ట్ K' టీమ్ విషెస్

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్

మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!

దుబాయ్ లో 'ఖిలాడి' టీమ్

ఫ్రెండ్ తో సమంత యాత్రలు

టాప్ ప్రొడ్యూసర్ తో శిరీష్ కొత్త సినిమా..!

భారీ యాక్షన్ సీన్స్ తో "గంధర్వ"
ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అప్సర్ దర్శకత్వంలో”వంగవీటి”, “జార్జిరెడ్డి'” మూవీస్ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “గంధర్వ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ కథానాయికలు.ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నారు. ఎమ్.ఎన్ మధు నిర్మాత.

నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా..!
యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య నిఖిల్ సినిమాలు ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఇంతకుముందు ఒక సినిమా తరువాత ఒక సినిమా చేశాననీ, ఈ సారి మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు.. అంతేకాదు నాలుగు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టమంటే ఏం చెబుతాం .. ఇది కూడా అంతే అంటూ చమత్కరించాడు. ఈ సినిమాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశాడు.

"వాల్తేరు వీరయ్య " గా చిరంజీవి మాస్ లుక్
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పూజాహెగ్డే న్యూ లుక్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

'రంగమార్తాండ' కోసం చిరు గాత్ర దానం..!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలేవీ విజయాన్ని అందించలేకపోయాయి. అందుకే ఇప్పుడు రీమేక్ తో రాబోతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా అన్ని సినిమాల్లాగే కరోనా వల్ల బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

'ఆది పురుష్' ఫైనల్ షెడ్యూల్ లో ప్రభాస్..!
సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొత్తానికి ఒక సినిమా తర్వాత మరొక సినిమా పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తను నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. వచ్చే ఏదాది సంక్రాతికి సందడి చేయనుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ ఇంట్రడక్షన్ వీడియో ఏ రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం. దీంతో ఈసినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది.

యాక్షన్ సీక్వెన్స్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'
క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్…

శ్రీసింహా 'భాగ్ సాలే' షూటింగ్ మొదలు
మొదటి సినిమా 'మత్తు వదలరా' లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఆ తరువాత తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక మత్తు వదలరా, తెల్లవారితే గురువారం చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో సినిమా భాగ్ సాలే. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు. ఇక ఈసినిమా షూటింగ్ నేడు మొదలైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్…

రష్మిక హెవీ వర్కౌట్
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక…

'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ అందుకున్న సూపర్ స్టార్
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు జరిగిన ఈకార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను దక్కించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా రజినీ సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన అవార్డ్ ను తనకు సీనీ రంగానికి పరిచయంచేసిన కె. బాలచందర్, అలాగే తన సోదరుడు, ఇంకా డైరెక్టర్లు, కోస్టార్లు, ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ కి అంకితం చేశారు.

"రాధేశ్యామ్" మూవీ టీజర్ రికార్డ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'సలార్' ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్..!
ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందులో సలార్ సినిమా కూడా ఒకటి ఉంది. ఇక ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవలే ఈసినిమా నుండి పది సెకండ్ల యాక్షన్ బిట్ ఒకటి లీక్ అవ్వగా మరింత క్రేజ్ తోడయిందని చెప్పాలి.

సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” (మలయాళ) మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం…

టాలీవుడ్ లో బిజీగా శ్రీలీల
సక్సెస్ ఫుల్ "కిస్" మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయిన శ్రీలీల "పెళ్ళిసందD " మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో శ్రీలీల తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. శ్రీలీల ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ "ధమాకా" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా "ధమాకా "మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

'సూపర్ హీరో' కు 'ప్రాజెక్ట్ K' టీమ్ విషెస్
నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్లు.. విషెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. అన్నీ కూడా డిఫరెంట్ జోనర్ లో వస్తున్న సినిమాలే. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. దీంతో అభిమానులకు సర్ పైజ్ ల మీద సర్ ప్రైజ్ లు అందుతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి ఆయన ఇంట్రడక్షన్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ప్రాజెక్ట్ కే టీమ్ కూడా ప్రభాస్ కు విషెస్ అందించింది. వైజయంతీ మూవీస్ సంస్థ తమ…

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ పోస్ట్ లతో సందడి చేస్తున్నారు. దీనితో పాటు ప్రభాస్ సినిమాల నుండి కూడా అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసందర్భంగా ప్రభాస్ కు దేశవ్యాప్తంగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే అనుష్క కూడా ప్రభాస్ కు స్పెషల్ విషెస్ అందించింది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్.. లైఫ్ లో వచ్చే ప్రతి అంశంలో బెస్ట్ గా ఉండాలని అలాగే నీ స్టోరీస్ అన్నీ విజయవంతం అయ్యి అందరి హృదయాలను…

మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. ఆ సినిమా షూటింగ్ అవ్వగానే వెంటనే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

దుబాయ్ లో 'ఖిలాడి' టీమ్
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లగా ఇంతవరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. దానికితోడు కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. దీనివల్ల వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే దాదాపు ఈసినిమా షూటింగ్ పూర్తయింది. ఇక తాజాగా ఖిలాడి టీమ్ దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఈరోజు నుండి అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక సాంగ్ చిత్రీకరణతో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఖిలాడి షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు…

ఫ్రెండ్ తో సమంత యాత్రలు
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

టాప్ ప్రొడ్యూసర్ తో శిరీష్ కొత్త సినిమా..!
అల్లు శిరీష్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా కాలం అయింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చిన శిరీష్.. ఇప్పటివరకూ మరొక సినిమాను చేయలేదు. ఇక మధ్యలో కరోనా కూడా రావడంతో దాదాపు అల్లు శిరీష్ నుండి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. ఇక ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్…