సక్సెస్ ఫుల్ “కిస్” మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయిన శ్రీలీల “పెళ్ళిసందD ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో శ్రీలీల తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. శ్రీలీల ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ “ధమాకా” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా “ధమాకా “మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీలీల కథానాయికగా 5 లేదా 6 సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య యంగ్ హీరోయిన్స్‌కు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. బ్లాక్ బస్టర్ “ఉప్పెన ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.”రొమాంటిక్ “బ్యూటీ కేతిక శర్మ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. వారిద్దరి మాదిరిగానే శ్రీలీల కూడా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: