మొదటి సినిమా ‘మత్తు వదలరా’ లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. ఆ తరువాత తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక మత్తు వదలరా, తెల్లవారితే గురువారం చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో సినిమా భాగ్ సాలే. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు. ఇక ఈసినిమా షూటింగ్ నేడు మొదలైంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
.@Simhakoduri23‘s #BhaagSaale launched today !
🎥 Switch on by @SBDaggubati garu
🎬 By @Harish2you garuDirected by @IamPranithB
Produced by @YashBigBen & #SinganamalaKalyan
A @kaalabhairava7 musical 🎶Presented by @SureshProdns pic.twitter.com/S5RmoXrBwo
— Suresh Productions (@SureshProdns) October 25, 2021
కాగా క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమానుప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు నటిస్తున్నారు ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: