
ట్యాగ్ · 290 కథనాలు · పేజీ 5


డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'

నాని కి జోడీగా సమంత మరోసారి ?

షాలిని పాండే లేటెస్ట్ లుక్

'నాయట్టు' రీమేక్ మొదలు..!

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ అప్ డేట్

ఆది పురుష్ పక్కా ప్లాన్ తో వెళుతున్న ఓం రౌత్..!

లావణ్య త్రిపాఠి సాహసం
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!

సాయి పల్లవి ఫిట్ నెస్ సీక్రెట్

"బంగార్రాజు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రాధేశ్యామ్' ప్రభాస్ టీజర్ వ్యూస్ పై క్లారిటీ..!

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్

త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్"బ్రింద" షూటింగ్ ప్రారంభం

శృతి హాసన్ ఫెస్టివల్ లుక్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సలార్”మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. సీనియర్ హీరోల మూవీస్ లో శృతి ఆఫర్స్ అందుకుంటున్నారు.

డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'
మొత్తానికి అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ ఇన్నేళ్లకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాపై పెట్టుకోగా.. ఈసినిమా ఆ ఆశలను నేరవేర్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన హిట్ దక్కడంతో అఖిల్ కు ఫుల్ ఎనర్జీ వచ్చినట్టైంది.

నాని కి జోడీగా సమంత మరోసారి ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ద్విభాషా చిత్రానికి స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

షాలిని పాండే లేటెస్ట్ లుక్
సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “మహానటి “, “118 “మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మూడు సినిమాలకు షాలిని అగ్రిమెంట్ చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దివ్యాంగ్ తక్కర్ దర్సకత్వంలో రణ్ వీర్ సింగ్ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన “జయేశ్ భాయ్ జోర్దార్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తో షాలిని బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.

'నాయట్టు' రీమేక్ మొదలు..!
టాలీవుడ్ లో ప్రస్తుతం పలు మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో రీమేక్ సెట్స్ పైకి వచ్చింది. మలయాళంలో ఈ ఏడాది వచ్చిన నాయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే.

"పుష్ప " మూవీ సామీ సామీ సాంగ్ రికార్డ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

అంతర్వేది లక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో శర్వా , రష్మిక
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం.

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ అప్ డేట్
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన " సమ్మోహనం" మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ తెరకెక్కుతుంది. కృతిశెట్టి కథానాయిక కాగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఆది పురుష్ పక్కా ప్లాన్ తో వెళుతున్న ఓం రౌత్..!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఆదిపురుష్'. ఇక ఈసినిమా షూటింగ్ దగ్గర నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకూ ఓం రౌత్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే చాలా స్పీడ్ గా షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. నిజానికి ఈసినిమా కరోనా టైమ్ లోనే సెట్స్ పైకి వెళ్లింది. ఆదిలోనే ఎన్నో ఇబ్బందులు వచ్చినా.. షూటింగ్ కు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ ను జరిపాడు.

లావణ్య త్రిపాఠి సాహసం
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా.. మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీరిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అయితే హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో చూశాం. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చే న్యూసే అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీటే కారణం…

సాయి పల్లవి ఫిట్ నెస్ సీక్రెట్
నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా నటించిన “లవ్ స్టోరీ”మూవీ ఘనవిజయం సాధించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"బంగార్రాజు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.“బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ , మైసూర్ షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. “బంగార్రాజు ” మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'రాధేశ్యామ్' ప్రభాస్ టీజర్ వ్యూస్ పై క్లారిటీ..!
జిల్ ఫేమ్ రాాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే అప్ డేట్స్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటినుండో చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ వీడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. విజువల్స్, విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉండటంతో టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ టీజర్‌ను చూస్తుంటే.. సినిమాపై మరింత ఆసక్తి పెరగుతోంది.

"ది ట్రిప్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వీడీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మాతగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రలలో విభిన్న కథా చిత్రం "ది ట్రిప్" తెరకెక్కుతుంది. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడకండ్ల ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల…

నిర్మాతగా మారిన అమలా.. సూపర్ గా ఫస్ట్ లుక్ పోస్టర్..!
ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. మరి హీరోయిన్లు మాత్రం సైలెంట్ గా ఉంటారా. వాళ్లు కూడా ఫామ్ లో ఉన్నప్పుడే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు నిర్మాతలుగా కూడా మారుతున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ నుంచి అప్‌కమింగ్ హీరోయిన్ అవికా గోర్ వరకూ నిర్మాతలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక తాజాగా మరో హీరోయిన్ హీరో కూడా ఈ లిస్ట్ లో చేరింది ఆహీరోయిన్ ఎవరో…

"భోళా శంకర్ "మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "వేదాళం"తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.

త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్"బ్రింద" షూటింగ్ ప్రారంభం
తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన పలు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. త్రిష కథానాయికగా రూపొందిన ‘గర్జన “, “సేతురంగ వెట్టై 2”, “రాంగి ” , “పొన్నియిన్ సెల్వన్ “ తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్రిష ప్రస్తుతం“రామ్ ” (మలయాళ ) , "ద్విత్వ " కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తెలుగు వెబ్ సిరీస్ కు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.