ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అందులో సలార్ సినిమా కూడా ఒకటి ఉంది. ఇక ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవలే ఈసినిమా నుండి పది సెకండ్ల యాక్షన్ బిట్ ఒకటి లీక్ అవ్వగా మరింత క్రేజ్ తోడయిందని చెప్పాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ సలార్ గురించి చెప్పిన మాటలు వింటే ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఈసినిమా ఫ్యాన్స్ కు మంచి యాక్షన్ ఫీస్ట్ అని.. ఈసినిమా ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా ప్రతి ప్రేక్షకుడికి కూడా నచ్చుతుందని అంటున్నాడు.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: