క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్ గా ఈ సీన్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ చేయడానికిి ప్లాన్ చేస్తున్నారు.
దీనితోపాటు రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ధమాకా సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: