
ట్యాగ్ · 25 కథనాలు


సల్మాన్ సినిమా.. త్వరలో సెట్స్ పైకి 'వెంకీ'

మీకు నచ్చిన వెంకీ బెస్ట్ మూవీ..?

వెంకటేష్ రిలీజ్ చేయనున్న "లక్ష్య " మూవీ ట్రైలర్

వెంకీ కోసం స్పానిష్ సిరీస్..!

2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!

"F 3" మూవీ అప్ డేట్

ఫాదర్స్ డే కి దృశ్యం 2..?

"దృశ్యం 2 " మూవీ అప్ డేట్
విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 ప్రారంభం
మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'
'నారప్ప' షూటింగ్ పూర్తి
'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
ఇండస్ట్రీ హిట్ "ప్రేమించుకుందాం రా !"

వెంకీ తో జాతి రత్నాలు డైరెక్టర్?
అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. స్మాల్ బడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మంచి కలెక్షన్స్ ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమాతో డైరెక్టర్ అనుదీప్ క్రేజ్ కూడా బాాగా పెరిగింది. హీరోల సంగతి పక్కన పెడితే ఆయన ఇన్నోసెంట్ గా చేసే కామెడీ కి, కామెడీ టైమింగ్ కు అసలైన జాతిరత్నం తనే అంటూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తరువాత అనుదీప్ ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా…

సల్మాన్ సినిమా.. త్వరలో సెట్స్ పైకి 'వెంకీ'
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు నటీనటులు. ఇందుకు స్టార్ హీరోలేం మినహాయింపుకాదు. వాళ్లుకూడా ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ వచ్చినా స్టార్ ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి వేరే భాషల్లో చేయడానికి ముందుకువస్తున్నారు. అందుకు నిదర్శనమే బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన సల్మాన్ తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో చేయడం. చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో సల్మాన్ లాంటి హీరో నటించడం విశేషం. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరో అయిన వెంకీ కూడా సల్మాన్ సినిమాలో నటిస్తున్నాడు.

'ఎఫ్ 3' నుండి మనీ యాంథమ్-డబ్బు ఇంపార్టెన్స్ చెబుతున్న వరుణ్, వెంకీ..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్3. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన వెంకీ బెస్ట్ మూవీ..?
విక్టరీ అంటే టాలీవుడ్ లో మనకు వెంటనే గుర్తొచ్చే పేరు వెంకటేష్. విక్టరీ ఎప్పుడూ తన ఫ్రెండ్ లా పక్కనే ఉంటుంది వెంకీ కి. అందుకే దగ్గుబాటి వెంకటేష్ ప్లేస్ లో విక్టరీ వెంకటేష్ రీప్లేస్ అయింది. 1986లో కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు వెంకీ. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టడమే కాకుండా నంది అవార్డు కూడా అందుకున్నాడు. మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఆ తరువాత మాత్రం వెంకీ సినిమా అంటే చాలు ఖచ్చితంగా హిట్ అయినట్టేఅన్న నమ్మకానికి వచ్చారు అందరూ. ఇక ఆ తరువాత తన కెరీర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం దక్కించుకున్నాడు. అందుకే అందరి హీరోల అభిమానులు కూడా వెంకీ కి…

వెంకటేష్ రిలీజ్ చేయనున్న "లక్ష్య " మూవీ ట్రైలర్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మజంటగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

వెంకీ కోసం స్పానిష్ సిరీస్..!
ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో వెంటనే రీమేక్ చేసేస్తున్నారు. మేకర్స్ కూడా హిట్ సినిమాల రైట్స్ ను అంతే ఫాస్ట్ గా సొంతం చేసుకోడానికి చూస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అయితే ఆ విషయంలో కాస్త ముందే ఉంటారు. ఇప్పటికే వెంకీ తో ఎన్నో సినిమాల రీమేక్ లు తెరకెక్కించి హిట్స్ కొట్టారు. ఇక ఇప్పుడు తాజాగా వెంకీ కోసం స్పానిష్ సిరీస్ ను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. సురేష్ బాబు ఈ సిరీస్ హక్కులను సొంతం చేసుకోడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే నెట్ ఫ్లిక్స్ వారు కానీ లేకపోతే సురేష్ బాబే స్వయంగా ఈ రీమేక్ ను…

2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్ర హీరోలు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో వెంకీ ఇంకా సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ ఈ ఏడాది మూడు సినిమాలతో సిద్దంగా ఉన్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా.. ఇంకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న నారప్ప, ఇంకా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దృశ్యం2 సినిమా. ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు నారప్ప, దృశ్యం 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఎఫ్3 సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈసినిమా కూడా దాదాపు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!
ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. 'పెళ్ళైనకొత్తలో సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో ఎంతో మంది హీరోలతో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పలు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

"F 3" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. “F2 “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

ఫాదర్స్ డే కి దృశ్యం 2..?
జీతూజోసఫ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్ తో చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన పోర్షన్స్ మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది. వెంకీ ఈసినిమా కంటే ముందు మొదలు పెట్టిన ఎఫ్ 3 సినిమా కూడా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఈసినిమా షూటింగ్ మాత్రం దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఏప్రిల్ చివరికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.

"దృశ్యం 2 " మూవీ అప్ డేట్
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా ఆపదలనుండి కుటుంబాన్ని రక్షించుకునే నేపథ్యంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "దృశ్యం "మలయాళ మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు "దృశ్యం " మూవీ కి సీక్వెల్ "దృశ్యం 2" మూవీ తెరకెక్కుతుంది.
నారప్ప - యంగ్ వెంకటేష్ లుక్ రిలీజ్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో అసురన్ రీమేక్ ‘నారప్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 ప్రారంభం
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ విక్టరి వెంకటేష్, మీనా జంటగా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వస్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజినల్ మళయాల వెర్షన్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్‌కుమార్ థియేటర్ ప్రై.లి పతాకాలపై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్టరి…
మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.
'నారప్ప' షూటింగ్ పూర్తి
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి కూడా విదితమే. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ "దృశ్యం " మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.
ఇండస్ట్రీ హిట్ "ప్రేమించుకుందాం రా !"
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ , అంజలా జవేరి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"ప్రేమించుకుందాం రా !" (1997 ) మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ తో జయంత్ దర్శకుడిగా , అంజలా జవేరి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ మూవీ కి మణిశర్మ , మహేష్ మహదేవన్ సంగీతం అందించారు. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
థియేటర్స్ కు గ్రీన్ సిగ్నల్ .. కేసీఆర్ కు చిరు కృతజ్ఞతలు
కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ రంగానికి కూడా భారీ నష్టమే కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఎక్కువ నష్టమే కలిగిందని చెప్పొచ్చు. థియేటర్స్ మూత పడటం.. షూటింగ్ లు చేయలేని పరిస్థితి.. మరో పక్క కరోనా వల్ల ఎంతో మంది సెలెబ్రిటీస్ మరణించడం.. సినీ కార్మికులకు ఇబ్బందులు ఇలా చాలా సమస్యలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే"
శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , అందాల త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ ఘనవిజయం సాధించింది. కె విశ్వనాథ్ , కోట శ్రీనివాస రావు , సునీల్ , కలర్స్ స్వాతి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది.