విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్3. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు రోజుల క్రితమే ఈపాట ప్రోమోను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మనీ యాంథమ్ పేరుతో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ అంటూ రిలీజ్ అయిన ఈ పాట మంచి ఎనర్జిటిక్ గా ఉంది. వెంకీ మామ యూత్‌ఫుల్ గెటప్ లో ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటే మరోపక్క వరుణ్ మాత్రం స్వామీజీ గెటప్ లో ఉన్నాడు. డబ్బుకున్న ఇంపార్టెన్స్ ను ఈపాట ద్వారా చెబుతున్నారు వెంకీ, వరుణ్.
మనీకి అంతం లేదు!
ఈ MONEY ANTHEM కి తిరుగు లేదు🥁Here’s #LabDabLabDabDabboo🤑Lyrical from #F3Movie
▶️https://t.co/fM8AOuvLGj@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @AnilRavipudi @ThisIsDSP @bhaskarabhatla @Ram_Miriyala @SVC_official@adityamusic pic.twitter.com/vOdnm2VE0H— Sri Venkateswara Creations (@SVC_official) February 7, 2022
అనిల్ రావిపుడ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో తమన్నా, మెహరిన్, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ , సునీల్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: