టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు నటీనటులు. ఇందుకు స్టార్ హీరోలేం మినహాయింపుకాదు. వాళ్లుకూడా ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ వచ్చినా స్టార్ ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి వేరే భాషల్లో చేయడానికి ముందుకువస్తున్నారు. అందుకు నిదర్శనమే బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన సల్మాన్ తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాలో చేయడం. చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ చిన్న పాత్రలో సల్మాన్ లాంటి హీరో నటించడం విశేషం. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరో అయిన వెంకీ కూడా సల్మాన్ సినిమాలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో వెంకీ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ఆచార్య’ సినిమా కోసం వేసిన ‘ధర్మస్థలి’ టెంపుల్ సెట్ ను వాడుకోబోతున్నారు. ఆ సెట్‌లోని సీన్స్‌లో వెంకీ జాయిన్ కానున్నట్టుగా చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం వెంకీ జూన్ 10 నుండి జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి వెంకీ-సల్మాన్ ఎప్పటినుండో ఫ్రెండ్స్.. ఇద్దరూ కామెడీని ఈజీగా పండించగలరు.. దీంతో సల్మాన్ ఖాన్, వెంకటేషే క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం సల్మాన్-వెంకీ కాంబినేషన్ ఎలా ఉంటుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: