థియేటర్స్ కు గ్రీన్ సిగ్నల్ .. కేసీఆర్ కు చిరు కృతజ్ఞతలు

Mega Star Chiranjeevi Thanks CM KCR for supporting tollywood film industry with their new initiatives

కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ రంగానికి కూడా భారీ నష్టమే కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఎక్కువ నష్టమే కలిగిందని చెప్పొచ్చు. థియేటర్స్ మూత పడటం.. షూటింగ్ లు చేయలేని పరిస్థితి.. మరో పక్క కరోనా వల్ల ఎంతో మంది సెలెబ్రిటీస్ మరణించడం.. సినీ కార్మికులకు ఇబ్బందులు ఇలా చాలా సమస్యలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోలో సినీపరిశ్రమకు కూడా కొన్ని రాయితీలు ఇచ్చారు. ఇక గత పది నెలలుగా రాష్ట్రంలో మూతపడిన సినిమా థియేటర్ల పునః ప్రారంభానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇక ఈ సందర్భంగా చిరంజీవి దీనిపై స్పందిస్తూ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.. ‘చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలను పెంచుకునేందుకు అనుమతినివ్వడం మంచి నిర్ణయం. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టికెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు కష్ట సమయంలో సినీ పరిశ్రమకు, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్‌ నేతృత్వంలో ఆయన విజన్‌కు తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుందని’ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

కాగా రీసెంట్ గానే చిత్ర పరిశ్రమకు చెందిన చిరంజీవి, నాగార్జున తో పాటు పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.