సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్ , అంజలా జవేరి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్”ప్రేమించుకుందాం రా !” (1997 ) మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ తో జయంత్ దర్శకుడిగా , అంజలా జవేరి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఈ మూవీ కి మణిశర్మ , మహేష్ మహదేవన్ సంగీతం అందించారు. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యం లో రూపొందిన “ప్రేమించుకుందాం రా !” మూవీ 50 సెంటర్స్ కు పైగా శతదినోత్సవం జరుపుకున్న మొదటి తెలుగు ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ గా నటించిన అంజలా జవేరి తన గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు జయంత్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఫ్రెష్ నెస్ తో యూత్ ఫుల్ గా, అద్భుత ప్రేమకథ గా “ప్రేమించుకుందాం రా !” మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “ప్రేమించుకుందాం రా !” మూవీ ప్రేమ కథా చిత్రాలకు మార్గం సుగమం చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: