ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2
బాబాయ్ తో అబ్బాయి సినిమా కన్ఫామ్
'నారప్ప' షూటింగ్ షురూ త్వరలో టీజర్..!
కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్"

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు.. ఎవర్ గ్రీన్ బెస్ట్ కామెడీ సీన్స్
విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మరో కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.1996 మే 22న రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది.
బాబాయ్ తో అబ్బాయి సినిమా కన్ఫామ్
రానా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా వున్నాడు. ప్రస్తుతం 'విరాట పర్వం', అరణ్య సినిమాలతో బిజీ గా ఉన్నాడు. కరోనా లేకపోతే ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. అయితే ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇచ్చిన అప్ డేట్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను దిల్ కుష్ చేస్తుంది. ఇంతకీ రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చెప్పొడో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
'నారప్ప' షూటింగ్ షురూ త్వరలో టీజర్..!
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ పునఃప్రారంభించింది చిత్రయూనిట్.
కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రముఖ యాంకర్ అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వెంకటేష్ ‘ఒంటరి పోరాటం’కు 31 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘ఒంటరి పోరాటం’ ఒకటి. ‘కలియుగ పాండవులు’, ‘భారతంలో అర్జునుడు’ వంటి సినిమాల తరువాత వెంకీ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘ఒంటరి పోరాటం’. ఇందులో వెంకీకి జోడిగా ఉత్తరాది భామ ఫరా నటించగా.. రూపిణి మరో నాయికపాత్రలో కనిపించింది. కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్‌రాజ్, శివాజీరాజా, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.జె.శర్మ, అన్నపూర్ణ, శుభ, మమత, ‘డబ్బింగ్’ జానకి ముఖ్య భూమికలు పోషించగా.. ‘సహజనటి’ జయసుధ…