జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తెలుగులో కూడా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో నటించిన వెంకీనే ఈ సీక్వెల్ లో నటిస్తున్నాడు. జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా వెంకీ పలు మార్పులు సూచించటంతో… జీతు జోసెఫ్ ప్రస్తుతం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ ను కూడా తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మార్చి 8వ తేదీన ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో తమిళంలో హిట్టయిన ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: