విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ విక్టరి వెంకటేష్, మీనా జంటగా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వస్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజినల్ మళయాల వెర్షన్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్‌కుమార్ థియేటర్ ప్రై.లి పతాకాలపై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్టరి వెంకటేష్, మీనా జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో నదియ, నరేష్, ఏస్తర్ అనిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సతీష్ కురూప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుండి ప్రారంభంకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్టరి వెంకటేష్, మీనా, నదియా, నరేష్, ఏస్తర్ అనిల్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: సతీష్ కురూప్,
సంగీతం: అనూప్ రూబెన్స్,
బేనర్స్: సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్‌కుమార్ థియేటర్ ప్రై.లి,
నిర్మాతలు: డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి,
దర్శకత్వం: జీతు జోసెఫ్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: