‘నారప్ప’ షూటింగ్ పూర్తి

Narappa Movie Team Wraps Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh,Hero Venkatesh,Actor Venkatesh,Daggubati Venkatesh,Venkatesh Daggubati Narappa,Venkatesh Narappa,Narappa Movie,Narappa Film,Narappa Telugu Movie,Narappa Movie Telugu,Narappa Wrap Up Shoot,Venkatesh Narappa Wrap Up Shoot,Narappa Shoot,Narappa Shooting Update,Narappa Wrap Up,Venkatesh Narappa Wrap Up,Venkatesh Narappa Shoot,Narappa On May 14,Narappa Movie Shooting Work,,Narappa Wraps Up Shooting Work,#Narappa

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి కూడా విదితమే. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నిర్మాత సురేశ్‌బాబు, న‌టీన‌టులు, ఇత‌ర సిబ్బందితో క‌లిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. నార‌ప్ప చిత్రీక‌ర‌ణ ముగిసింది.. ఈ వేస‌వికి థియేట‌ర్ల‌లో క‌లుద్దాం అని ట్వీట్ చేశారు.

కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా పాత్రలో కార్తీక్ ర‌త్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + four =