శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , అందాల త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” మూవీ ఘనవిజయం సాధించింది. కె విశ్వనాథ్ , కోట శ్రీనివాస రావు , సునీల్ , కలర్స్ స్వాతి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” మూవీ లో హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. హీరోయిన్ త్రిష తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. రమేష్ -గోపి అందించిన డైలాగ్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
రియలిస్టిక్ టచ్ తో పూర్తి ఎంటర్ టైనర్ గా “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”మూవీ ని తెరకెక్కించి దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: