అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. స్మాల్ బడ్జెట్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మంచి కలెక్షన్స్ ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమాతో డైరెక్టర్ అనుదీప్ క్రేజ్ కూడా బాాగా పెరిగింది. హీరోల సంగతి పక్కన పెడితే ఆయన ఇన్నోసెంట్ గా చేసే కామెడీ కి, కామెడీ టైమింగ్ కు అసలైన జాతిరత్నం తనే అంటూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తరువాత అనుదీప్ ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమా తెరకెక్కు తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. గతకొద్ది కాలంగా అగ్రహీరో విక్టరీ వెంకటేష్ తో సురేష్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై తాజాగా అనుదీప్ నే డైరెక్టర్ గా అడుగగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. కథ రెడీగా ఉందని.. అయితే ఇంకా కథను వినిపించలేదని.. వెంకటేష్ గారు కనుక సినిమాను ఓకే చేస్తే త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని తెలిపాడు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా అప్ డేట్ ఇస్తానని స్పష్టం చేశాడు. చూద్దాం ఇప్పుడు అగ్రహీరోలైనా కూడా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు. మరి అనుదీప్ కు కూడా ఆ అవకాశం వస్తుందేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: