సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ “దృశ్యం ” మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ “దృశ్యం ” మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన “దృశ్యం ” మూవీలో హీరో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్ మీనా తన పాత్రకు న్యాయం చేశారు. వెంకటేష్ , మీనా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. శరత్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ కి హెల్ప్ అయ్యింది.ఈ మూవీ లో నటించిన ప్రతీ ఒక్కరి నుండీ చక్కని నటనను రాబట్టుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకురాలు శ్రీప్రియ “దృశ్యం ” మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. “దృశ్యం ” మూవీ బెస్ట్ ఫిల్మ్ , బెస్ట్ యాక్టర్ , బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ డైరెక్టర్ గా TSR – TV 9 నేషనల్ అవార్డ్స్ అందుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: