
ట్యాగ్ · 165 కథనాలు · పేజీ 8


నా భీమ్ హృదయం బంగారం

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!

"RRR" టీమ్ ఐదు భాషలలో కరోనా సందేశం

'గంగూబాయి కతియావాడి' తెలుగు టీజర్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ - అలియా వల్ల రీ షెడ్యూల్
రామ్ చరణ్ కు జోడీగా మరోసారి ?
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్రహ్మాస్త్ర'
'సితార' కు 'అలియా' స్పెషల్ గిఫ్ట్
"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ
'RRR' - భీమ్ సర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్
పాన్ ఇండియా మూవీస్ లో అలియా భట్ ?
ఇండో -చైనా ప్రేమ కథ మూవీ లో అలియాభట్
కన్ఫామ్.. ఆ సినిమాలో అలియా లేదు..!

అఫీషియల్.. 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ డీటైల్స్
ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంత బడ్జెట్ ఎందుకు సినిమా పోతే పరిస్థితి ఏంటి అనుకోడానికి అక్కడ ఉంది రాజమౌళి... స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్. కాస్త లేట్ అయినా జక్కన్న మంచి అవుట్ పుట్ వచ్చాకే సినిమాను వదులుతాడు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈసినిమా హక్కులు ఏ రేంజ్ లో అమ్ముడుపోయాయో చూశాం. దానికి కారణం బాహుబలి కూాడా అనుకోండి. ఈసినిమా ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టిందో తెలుసు కదా. ఆ సినిమా ప్రభావం కూడా ఆర్ఆర్ఆర్ పై పడింది. హాట్ కేకుల్లా హక్కులను సొంతం చేసుకోడానికి పోటీ పడ్డారు. ఇక ఈసినిమా…

నా భీమ్ హృదయం బంగారం
ఆర్ఆర్ఆర్.. ఈసినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఎంతగా ఎదురుచూస్తున్నారో సినిమా రిలీజ్ కూడా అంతగా వెనక్కి వెళుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈసందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఆ పోస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బళ్ళెంతో గురి పెట్టిన కొమురం భీం గా సరికొత్త మేకోవర్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశారు. కళ్లల్లో ఇంటెన్సిటీ.. పొడవాటి తిలకం.. నీటిలోంచి ఎగురుతూ బల్లెం…

'ఆర్ఆర్ఆర్' 10 ఏళ్ల కల..!
రాజమౌళి తో సినిమా అంటే ప్రతి ఒక్కహీరోకి చేయాలన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికీ పది సినిమాల వరకూ చేశాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే.. అప్పటికే డైరెక్టర్ గా రాజమౌళికి మంచి పేరుంది.. ఇక బాహుబలితో తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలియచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈప్రాజెక్ట్ తన పదేళ్ల డ్రీమ్ అంటున్నాడు రాజమౌళి. ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలంటే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కు అంత ఈజీ కాదు.. చాలా కష్టం అందులోనూ ఎన్టీఆర్-చరణ్ మంచి స్నేహితులే అయినా కూడా ఈడ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వడానికి 10ఏళ్లు టైమ్ పట్టింది అని చెప్పుకొచ్చాడు.

"RRR" టీమ్ ఐదు భాషలలో కరోనా సందేశం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'గంగూబాయి కతియావాడి' తెలుగు టీజర్ రిలీజ్
డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమా సినిమాకు తన నటనలో పరిణితి చెందుతూ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ గంగూబాయి కతియావాడి అనే సినిమాతో ఛాలెంజింగ్ రోల్ తో వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఇటీవలే హిందీ టీజర్ ను రిలీజ్ చేశారు. నేడు తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఆర్ఆర్ఆర్ - అలియా వల్ల రీ షెడ్యూల్
రాజమౌళి ఎంత తొందరగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అలియాకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ లో మళ్లీ కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు అలియా పేర్కొంది. వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నానని తెలిపింది.

'RRR' అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్ రిలీజ్ - 'లోడ్..ఎయిమ్..షూట్'
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రికార్డు స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళ్, కన్నడ, హిందీ హక్కులను పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నారు నిర్మాతలు.

'ఆర్ఆర్ఆర్' - అదిరిపోయిన చరణ్ 'రామరాజు' లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న టైమ్ రానేవచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజుకావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక చెప్పినట్టే రామ్ చరణ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. రామరాజు లుక్ ను రిలీజ్ చేశారు. చేతిలో విల్లుతో చరణ్ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇక చరణ్ లుక్ ని చూసి అభిమానులు సంబర పడిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ - అలియా ఫస్ట్ లుక్ రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అందులో రాముడి సన్నిధిన అలియా భట్ కూర్చొని ఉంది. ఇక నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అందరినీ…
ఆర్ఆర్ఆర్ - అలియా లుక్ కు టైమ్ ఫిక్స్
రాజమౌళి దర్శకత్వంలో భారీ పీరియాడికల్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రామ్ చరణ్ కు జోడీగా మరోసారి ?
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా రూపొందిన "భరత్ అనే నేను "మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ లో కియారా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి "హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ లో కియారా కథానాయికగా నటించారు. "కబీర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.
"RRR" మూవీ సాంగ్ కు స్పెషల్ సెట్
డివివి ఎంటర్ టైన్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో "రౌద్రం రణం రుధిరం " మూవీశరవేగంగా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయికతియావాడీ. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో అలియా నటన చూసినవారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్రహ్మాస్త్ర'
కరోనా వల్ల పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఎప్పుడో రావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అలాంటి సినిమాల్లో నాగ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త సినిమా కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. దాదాపు రెండేళ్లు అవ్వొస్తుంది. మధ్యలో కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. అయితే లాక్‌డౌన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర పనులను కొంతమేరకు పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి ఫైనల్లీ ఫినిష్ చేసుకున్నారు.
'సితార' కు 'అలియా' స్పెషల్ గిఫ్ట్
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్ భామ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక వస్తూ వస్తూ మహేష్ గారాలపట్టి సితారకు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. తన సొంత బ్రాండ్ దుస్తులు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సితార పాప తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన సొంత బ్రాండ్ దుస్తులు సితారకి ఇవ్వగా వాటిని చూసి సంతోషంతో ఈ డ్రెస్ తనకెంతో నచ్చిందని సితార ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
'RRR' - భీమ్ సర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్
మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో ఐడియా వచ్చింది కదా. ఇంకేంటి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా. ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని మేకర్స్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో గేట్స్ తెరవడం, దుమ్ము పట్టిన వస్తువులను దులపడం, లొకేషన్ పరిసరాలని శుభ్రపరచడంకు సంబంధించిన…
పాన్ ఇండియా మూవీస్ లో అలియా భట్ ?
బ్లాక్ బస్టర్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ " మూవీ తో హీరోయిన్ గా అలియా భట్ బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించారు . అలియా భట్ నటించిన "హై వే ", "2స్టేట్స్ ", హంప్టీ శర్మ కి దుల్హనియా ", "ఉడ్తా పంజాబ్", "రాజి ", గల్లీ బాయ్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "ఉడ్తా పంజాబ్", "రాజి ", గల్లీ బాయ్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా అలియా ఆవార్డ్స్ అందుకున్నారు. ప్రస్తుతం 3 హిందీ మూవీస్ లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ అలియా "RRR" మూవీ లో కథానాయిక గా ఎంపిక అయిన విషయం తెలిసిందే.
ఇండో -చైనా ప్రేమ కథ మూవీ లో అలియాభట్
భారత్ , చైనా సరిహద్దు గల్వాన్ లోయ లో భారత , చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. భారత్ , చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో పలు మూవీస్ రూపొందనున్నాయి. మేజర్ రవి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా "బ్రిడ్జ్ ఆఫ్ గల్వాన్ " మలయాళ మూవీ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్వంత బ్యానర్ లో ఒక బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయ్యాయి.
కన్ఫామ్.. ఆ సినిమాలో అలియా లేదు..!
గత వారం రోజులుగా టాలీవుడ్ లో బాలీవుడ్ నటి అలియా భట్ పేరు బాగానే వినిపిస్తుంది. దీనికి కారణం రెండు సినిమాలు. అదేంటి అలియా నటించేది ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే కదా ఇంకో సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారు కదా..! అది తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే కరోనా వల్ల ఎక్కడివాళ్ళు అక్కడే ఉండటంతో.. ఒకవేళ ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్ అయినా అలియా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఈ సినిమా నుండి అలియా నటించట్లేదు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనుకోండి. కాస్త లేట్ అయినా కూడా అలియా తోనే రాజమౌళి షూట్ చేస్తాడు.