రాజమౌళి తో సినిమా అంటే ప్రతి ఒక్కహీరోకి చేయాలన్న డ్రీమ్ ఉంటుంది. ఇప్పటికీ పది సినిమాల వరకూ చేశాడు.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే.. అప్పటికే డైరెక్టర్ గా రాజమౌళికి మంచి పేరుంది.. ఇక బాహుబలితో తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచస్థాయికి తెలియచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈప్రాజెక్ట్ తన పదేళ్ల డ్రీమ్ అంటున్నాడు రాజమౌళి. ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలంటే ప్రతి ఒక్క ఫిలిం మేకర్ కు అంత ఈజీ కాదు.. చాలా కష్టం అందులోనూ ఎన్టీఆర్-చరణ్ మంచి స్నేహితులే అయినా కూడా ఈడ్రీమ్ ఫుల్ ఫిల్ అవ్వడానికి 10ఏళ్లు టైమ్ పట్టింది అని చెప్పుకొచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ సినిమాల్లో వస్తున్న అతి పెద్ద సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా అందరూ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూసి రెండేళ్ల పైన అవుతుండటంతో ఈసినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి కూడా చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 13న ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు కానీ ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: