దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రికార్డు స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళ్, కన్నడ, హిందీ హక్కులను పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నారు నిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఎన్టీఆర్, చరణ్, అలియా భట్, ఒలివియా మోరీస్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేయగా నేడు ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘లోడ్..ఎయిమ్..షూట్’ అంటూ అజయ్ గట్టిగా అరుస్తున్నారు. ఇక లుక్ ను బట్టి అజయ్ దేవగన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమవుతుంది.
[subscribe]
Watch Online Movies Here:
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: