ఆర్ఆర్ఆర్.. ఈసినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఎంతగా ఎదురుచూస్తున్నారో సినిమా రిలీజ్ కూడా అంతగా వెనక్కి వెళుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈసందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా విదితమే. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఆ పోస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బళ్ళెంతో గురి పెట్టిన కొమురం భీం గా సరికొత్త మేకోవర్ లో ఉన్న ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశారు. కళ్లల్లో ఇంటెన్సిటీ.. పొడవాటి తిలకం.. నీటిలోంచి ఎగురుతూ బల్లెం విసురుతున్న ఈలుక్ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా రాజమౌళి తన ట్విట్టర్ లో‘నా భీమ్ బంగారు హృదయాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతను తిరుగుబాటు చేసినప్పుడు, అతను బలంగా మారి ధైర్యంగా నిలుస్తాడు’ అని పెర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
My Bheem has a heart of gold.
But when he rebels, he stands strong and bold! 🌊Here’s @tarak9999 as the INTENSE #KomaramBheem from #RRRMovie.@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/8o6vUi9oqm
— rajamouli ss (@ssrajamouli) May 20, 2021
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న ఈభారీ బడ్జెట్ సినిమాను స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: