రాజమౌళి దర్శకత్వంలో రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అందులో రాముడి సన్నిధిన అలియా భట్ కూర్చొని ఉంది. ఇక నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజమౌళి ఈపాత్రకు అలియానే ఎందుకు తీసుకున్నాడో ఫస్ట్ లుక్ ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆకుపచ్చని చీర ధరించి తీక్షణంగా చూస్తూ ఉన్న అలియా లుక్ చూస్తుంటే సీత పాత్రలో అలియా భట్ ఒదిగిపోయినట్లు ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Strong-willed and resolvent SITA’s wait for Ramaraju will be legendary!
Presenting @aliaa08 as #Sita to you all 🙂@tarak9999 @AlwaysRamCharan #RRR #RRRMovie pic.twitter.com/NFe4WwjS6u
— rajamouli ss (@ssrajamouli) March 15, 2021
కాగా భారీ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.
ఇక ఈసినిమాతో పాటు బాలీవుడ్‌లో గంగుబాయ్ కథైవాడి అనే చిత్రంలో అలియా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అలియా మునుపెన్నడూ చేయని పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: