‘సితార’ కు ‘అలియా’ స్పెషల్ గిఫ్ట్

Actress Alia Bhatt Latest News, Alia Bhatt, alia bhatt gift to sitara, Alia Bhatt Gifts A Special Dress To Super Star Mahesh Babu Daughter Sitara, Bollywood Actress Alia Bhatt Gifts A Special Dress To Super Star Mahesh Babu Daughter Sitara, Mahesh Babu Daughter, mahesh babu daughter birthday, Mahesh Babu Daughter Sitara, Sitara, Super Star Mahesh Babu Daughter Sitara, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్ భామ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక వస్తూ వస్తూ మహేష్ గారాలపట్టి సితారకు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు ప్ర‌త్యేకంగా తీసుకొచ్చి ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సితార పాప తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. త‌న సొంత బ్రాండ్ దుస్తులు సితార‌కి ఇవ్వగా వాటిని చూసి సంతోషంతో ఈ డ్రెస్ తనకెంతో న‌చ్చిందని సితార ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సితార కు అలియా భట్ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు తనకు అలియా భట్ ను ఇంటర్వ్యూ చేయాలని ఉందని చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ఇక 2018లో మ‌హ‌ర్షి షూటింగ్ కోసం మ‌హేష్ బాబు త‌న కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ వెళ్లగా.. అదే స‌మ‌యంలో అలియా భ‌ట్ మూవీ షూటింగ్ కూడా అక్క‌డే జ‌రుగుతుంది. ఈ సంద‌ర్భంలో అలియా, సితార మీటింగ్ జ‌రిగింది. అలియాని చూసి మురిసిపోయిన సితార ఆమెతో ఫొటో కూడా దిగింది.

కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + three =