
ట్యాగ్ · 165 కథనాలు · పేజీ 9

ప్రభాస్‌కి జోడిగా అలియా భట్?
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!

అలియా భట్ తెలుగు క్లాసెస్ కు రీ జాయిన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ "రౌద్రం రణం రుధిరం " రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లోకథానాయిక గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ గా ఒలీవియా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
ప్రభాస్‌కి జోడిగా అలియా భట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఆర్ఆర్ఆర్' నుండి అలియా తప్పుకోలేదు.. అవన్నీ అబద్ధం
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ గురించి అటు రాంచరణ్ అభిమానులు, తారక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు తప్పని తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ నుండి అలియా తప్పుకుందని వస్తున్న వార్తల్లోవాస్తవం లేదనీ... డేట్స్ సమస్య వచ్చినప్పటికీ సర్దుబాటు చేసిందని.. ఈ సినిమా కోసం మే నుండి ఆమె షూటింగ్ లో పాల్గొనబోతుందని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పూణే…
అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్... ఇప్పుడు చరణ్ హీరోయిన్
టైటిల్ చూసి అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటీ... ఇప్పుడు చరణ్ హీరోయిన్ ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా... అసలు సంగతేంటంటే...ఆర్ఆర్ఆర్.. ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా. ఇక సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించినంత వరకూ షూటింగ్ ను జరుపుకోగా.... అలియా మే నుండి షూటింగ్ ను లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన పాత్రలకు సంబంధించి పోర్షన్…